కరోనాను జయించిన శేఖర్ మాస్టర్…

కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కు ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందరో స్టార్ హీరోలు వేసే అద్భుత స్టెప్పుల వెనక ఉన్న శేఖర్ ఎంతో మందికి ఫెవరేట్ కొరియోగ్రాఫ‌ర్. కేవలం సినిమాల్లో తన స్టెప్పులతోనే కాకుండా, బుల్లి తెరపై రియాలిటీ షో లలో తనదైన పంచ్‌ల‌తో బుల్లితెర‌పై వినోదాన్ని పంచుతాడీ స్టార్ కొరియోగ్రాఫర్.

ఇదిలా ఉంటే తాజాగా శేఖర్ మాస్టర్ కరోనాను జయించాడు. తాను కరోనా ను ఎలా జయించాడో ఓ వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ వీడియోలో మాస్టర్ మాట్లాడుతూ… ‘ఇప్పుడే ప్లాస్మా ఇచ్చాను. నెల కిత్ర‌మే క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. కిమ్స్‌లో చికిత్స తీసుకున్నా. ఇప్పుడు నా వంతు సాయంగా ప్లాస్మా ఇచ్చాను. సంతోషంగా ఉంది. క‌రోనా నుంచి రివ‌క‌రీ అయిన వారు కూడా ప్లాస్మాదానం చేయండి, ప్రాణాలు నిల‌బెట్టండ’ని చెప్పుకొచ్చాడు శేఖర్ మాస్టర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here