బాహుబలి 2 తో ఆగిపోవడం లేదు .. కొత్త నిర్ణయం తో సంచలనం రేపిన సోభు యార్లగడ్డ ..

బాహుబలి చిత్రం అసామాన్యమైన రీతి లో సాగుతోంది. అద్భుతమైన కలక్షన్ లతో ఈ చిత్రం తిరుగులేని సూపర్ అచీవ్మెంట్ ని సాధించింది. ఇప్పుడు ఈ సినిమా కి సీక్వెల్ కోసం అందరూ ఎదురు చూస్తున్న టైం లో బాహుబలి 3 తీసే ఛాన్స్ లేదు అని రాజమౌళి గట్టిగానే చెప్పేశారు. సో బాహుబలి ఇక మీదట కనిపించాదా అంటే ఖచ్చితంగా కనిపిస్తుంది అంటున్నారు.

వీ ఆర్ వీడియో లని కామిక్స్ అనీ కొత్తగా రాబోతున్నాడు బాహుబలి. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ తరహాలో బాహుబలి టీవీ సిరీస్ ను కూడా ఇండియాలో ఒక బ్రాండ్ గా మార్చాలని.. ప్రేక్షకుల్ని అలరించాలని బాహుబలి టీం భావిస్తోంది. ఈ టీవీ సీరీస్ హిందీ లో తెరకి ఎక్కుతుంది అని నిర్మాత సోభు చెబుతున్నారు. స్క్రిప్ట్ కూడా రెడీ అవుతోంది అనీ త్వరలో షూట్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు ఆయన.

దేశం నలుమూలలా దీనికి అభిమానులు ఏర్పడ్డారని.. కాబట్టి ఎక్కువమందికి రీచ్ అయ్యేందుకు ముందు హిందీలో తీసి.. తర్వాత తెలుగు సహా మిగతా భాషల్లోకి డబ్ చేస్తామిన ఆయన అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here