బాహుబలి టైం లో ప్రభాస్ కష్టాలు ఇవి .. తెలిస్తే బాధపడతారు మీరు కూడా

బాహుబలి కోసం నాలుగు సంవత్సరాలు కష్టపడిన హీరో ప్రభాస్ ఆ టైం లో బాహుబలి ని నో అనుకుని ఉంటె ఈ పాటికి ఆరేడు సినిమాలు చేస్తూ ఉండేవాడు. డబ్బుల విషయం లో కూడా బోలెడు సంపాదన వచ్చి ఉండేది. ఈ సినిమాతో ప్రభాస్ కి సూపర్ పేరు వచ్చిన మాట కూడా నిజమే. ఒక సినిమా కోసం ఇంతగా కమిట్ అయ్యే హీరోలు చాలా అరుదు అనే చెప్పాలి.

ఇండియాలో అమీర్ ఖాన్, విక్రమ్ లాంటి కొంతమంది తప్ప ప్రభాస్ చూపిన కమిట్మెంట్ అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఆర్ధికంగా బాహుబలి టైం లో ప్రభాస్ ఇబ్బందులు చాలా దారుణంగా ఉండేవట ఈ విషయం మౌళి చెప్పడం మరింత షాకింగ్ గా ఉంది. ” కొందరు నిర్మాతలు ప్రభాస్ వరస హిట్ లు చూసి చెక్కులతో వచ్చినా ప్రభాస్ బాహుబలి కే కమిట్ అయ్యాడు.

ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోవద్దు అంటూ మేనేజర్ కి కూడా చెప్పాడు ప్రభాస్. ఆర్ధికంగా బాహుబలి టైం లో ప్రభాస్ చాలా ఇబ్బంది పడ్డాడు. ఎవరైనా నిర్మాతలు డబ్బుల కట్టలతో వస్తే ఏం చెప్పాలి అని కూడా నన్నే అడిగేవాడు. పదికోట్ల ఎండార్స్మెంట్ లు కూడా వద్దన్నాడు ” అంటూ ప్రభాస్ ఇబ్బందులు చెప్పుకొచ్చాడు మౌళి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here