ఈ హీరోయిన్ కి ప్రేమించే టైం లేదట..

ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన వెంట‌నే అదృష్టం సొంతం చేసుకున్న హీరోయిన్ల‌లో నివేదా థామ‌స్ ఒక‌రు. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారీమె. జెంటిల్‌మెన్‌, నిన్నుకోరి, బ్రోచేవారెవ‌రురా, జై ల‌వ‌కుశ, జులియ‌ట్ ల‌వ‌ర్ ఆఫ్ ఇడియ‌ట్‌, 118 చిత్రాల‌తో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ‌. ప్ర‌స్తుతం మోహ‌న‌క్రిష్ణ ఇంద్ర‌గంటి డైరెక్ష‌న్‌లో వి సినిమాలో ఈమె న‌టించారు.

అయితే హీరోయిన్ గానే కాదు డైరెక్ష‌న్‌లో కూడా త‌న స‌త్తా ఏంటో చూపించాల‌ని నివేదా ఉవ్విల్లూరుతోంది. త‌న‌కు ద‌ర్శ‌క‌త్వం చెయ్యాల‌న్న కోరిక ఉంద‌ని నివేదా అంటోంది. అయితే డైరెక్ష‌న్ పార్ట్ ఇప్పుడు కాదు కానీ న‌టిగా త‌న‌ను తాను నిరూపించుకున్న త‌ర్వాత దీనిపై దృష్టి పెడ‌తాన‌ని చెబుతోంది. ప్రేమ‌, పెళ్లి గురించి మాట్లాడుతూ ఈ రెండు ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఎంతో ముఖ్య‌మైన‌వ‌ని చెప్పింది. అయితే ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో త‌న‌కు ప్రేమించే తీర‌క లేద‌ని తెలిపింది.

ఫోకస్ మొత్తం సినిమాల‌పైనే ఉంద‌ని నివేదా అంటున్నారు ఇక పెళ్లి చేసుకునే స‌మ‌యం వ‌స్తే క‌చ్చితంగా చేసుకుంటాన‌ని నివేదా థోమ‌స్ అంటుంది. సినిమాల్లో ఎన్నో విభిన్న‌మైన పాత్ర‌లు చేయాల్సి ఉంద‌ని అన్నారు ఈమె. నిజాయితీగా ఉండి, బాధ్య‌త‌లు పంచుకునే వ్య‌క్తిని పెళ్లి చేసుకుంటాన‌ని నివేదా అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here