జాన్వీక‌పూర్‌.. ఏం చేసింది..

జాన్వీ క‌పూర్ న‌టించిన సినిమా గుంజ‌న్ స‌క్సేనా. ది కార్గిల్ గ‌ర్ల్‌.. ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ తొలి మ‌హిళా పైల‌ట్ గుంజ‌న్ స‌క్సేనా జీవితం ఆధారంగా ఈ సినిమాను డైరెక్ట‌ర్ శ‌ర‌ణ్ శ‌ర్మ తీశారు. ఈ సినిమా నేడు ఓటీటీ వేదికైన నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యింది.

మ‌హిళా పైల‌ట్ జీవితం ఆధారంగా తీసిన సినిమా కాబ‌ట్టి అంద‌రూ ముందు నుంచీ ఈ సినిమాపై ఇంట్ర‌స్టింగ్ గా ఉన్నారు. అయితే ఈ సినిమాలో జాన్వీ క‌పూర్ త‌న పాత్ర‌ను బాగా న్యాయం చేశార‌ని అంటున్నారు. త‌న వ‌య‌సుకు మించిన రోల్ అయిన‌ప్ప‌టికీ చ‌క్క‌గా బ్యాలెన్స్ చేశార‌ట జాన్వీ.

ఈ సినిమాతో జాన్వీకి అభిమానులు పెరిగిపోయార‌ని ఇండ‌స్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక పంక‌జ్ త్రిపాఠి కూడా జాన్వీ తండ్రి పాత్ర‌లో అద్బుతంగా న‌టించారు. సినిమాలో జాన్వీతో పాటు న‌టించిన న‌టీన‌టులంద‌రికీ మంచి ప్ర‌శంస‌లు అందుతున్నాయి. ఇక గ‌తంలో ఎన్నో బ‌యోపిక్‌లు వ‌చ్చినా ఈ సినిమా మాత్రం అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటుంద‌ని చెబుతున్నారు.

ప్ర‌స్తుత స‌మాజంలో ఎంద‌రో అమ్మాయిల‌కు ఉన్న‌తంగా ఎదిగేందుకు ప్రోత్సాహం ద‌క్క‌దు. అయితే గుంజ‌న్ జీవితంలో మాత్రం త‌న తండ్రి ఎంతో ప్రోత్స‌హించార‌ని సినిమా ద్వారా ప్ర‌పంచానికి ద‌ర్శ‌కుడు తెలిపారు. మొత్తానికి స‌క్సేనా సినిమా ఇప్ప‌టికీ మంచి హిట్ మూవీ అని తెలుస్తోంది. ఓటీటీ వేదిక‌గా విడుద‌లైనా సినిమాకు మాత్రం మంచి రెస్సాన్స్ వ‌స్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here