హీరో నాని గుడ్ న్యూస్‌..?

తెలుగు ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు హీరో నాని. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం వి.  ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ డైరెక్ష‌న్‌లో నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. హీరో సుధీర్ బాబు పోలీస్ ఆఫీస‌ర్‌గా సినిమాలో న‌టిస్తున్నారు.

షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని మార్చి 25 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు వి సినిమా వాయిదా ప‌డుతూనే వ‌స్తుంది. ఐదు నెల‌ల‌వుతున్నా థియేట‌ర్లు ఓపెన్ అవ్వ‌క‌పోవ‌డంతో చిత్ర బృందం ఇక ఓటీటీని ఫాలో అవ్వాల‌ని యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ మేర‌కు దిల్ రాజ్ స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు ఇండ‌స్ట్రీలో టాక్ న‌డుస్తోంది.

రిలీజ్ మాత్ర‌మే పెండింగ్‌లో ఉన్న ఈ సినిమాను ఇక ఆల‌స్యం చేయ‌కూడ‌ద‌ని యూనిట్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. అందుకే అమేజాన్ ప్రైమ్‌తో రిలీజ్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని చెప్పుకుంటున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఏ విష‌యంపై ఇంత‌వ‌ర‌కు అధికారంగా స‌మాచారం బ‌య‌ట‌కు రాలేదు. కాగా ఫిలిం న‌గ‌ర్‌లో మాత్రం సెప్టెంబ‌ర్ 5న ఓటీటీలో నాని సినిమా రిలీజ్ అని డిస్క‌ష‌న్ న‌డుస్తోంది.

హీరో నానికి ఇది 25వ సినిమా. వ‌రుస హిట్ల‌తో మంచి ఫామ్‌లో ఉన్నారు నాని. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో రిలీజైతే సౌత్‌లో ఓటీటీలో విడుద‌ల‌య్యే పెద్ద సినిమా ఇదే అవుతుంది. ఈ సినిమా క‌నుక ఓటీటీలో విడుద‌లైతే ఇక వ‌రుసగా చాలా సినిమాలు విడుద‌ల‌వుతాయ‌ని అనిపిస్తోంది. మ‌రి నాని వి సినిమా గురించి మూవీ యూనిట్ ఎప్పుడు ప్ర‌క‌టిస్తుందో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here