శర్వానంద్ కథే నానీ దగ్గరకి వెళ్ళిందా ?

నేచురల్ స్టార్ నాని హీరోగా తాజా సినిమా కృష్ణార్జున యుద్ధం ఫస్ట్ లుక్ మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అసలు మొదట ఈ సినిమా హీరో శర్వానంద్ దగ్గరికి వెళ్లిందట అయితే కథ విషయంలోశర్వానంద్ కొన్ని మార్పులు సూచించడంతో డైరెక్టర్ హీరో మధ్య అండర్ స్టాండింగ్  కుదరక శర్వానంద్ ఈ ప్రాజెక్టుని తప్పుకోవడం జరిగింది అప్పట్లో కూడా శర్వానంద్ డబుల్ రోల్లో ఓ సినిమా చేస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది అదీ ఈ  సినిమా నే అట.

శర్వానంద్ కథ ను రిజక్ట్ చేయడంతో ఈ సినిమా హీరో నాని ని వరించింది. నాని తన బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా మార్పులు చేయించేసి రంగంలోకి దిగిపోయాడని అంటున్నారు.చివరాకరికి ఈ సినిమా   “కృష్ణార్జున యుద్ధం” గా రూపుదిద్దుకుంది.ఈ సినిమాకి డైరెక్టర్ గా మేర్లపాక గాంధీ వ్యవహరిస్తున్నాడు.వరుస హిట్ల మీద ఉన్న నాని ఈ సినిమాతో కూడా హిట్టు కొట్టి తన ఖాతాలో వేసుకుంటాడో లేధో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here