పవన్ కళ్యాణ్ మీద పీకలమీద దాకా ఉంది వీళ్ళకి

ప్రతి సామాన్యుడూ సమాజంలో జరిగే ప్రతిదానికి సోషల్ మీడియాలో రెస్పాండ్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఒక విధంగా చూసుకుంటే సోషల్ మీడియా వల్ల లాభం ఉంది, నష్టం కూడా ఉంది.మొత్తంమీద చూసుకుంటే సోషల్ మీడియా వల్ల  సినీ ఇండస్ట్రీ చాలా నష్టపోతోంది అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు .తాజాగా విడుదలైన అజ్ఞాతవాసి సినిమా మొదటి రోజునుండే ఫ్లాప్ టాక్ రావడంతో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ సినిమా మీద ఎప్పుడు లేనని విమర్శలు వెల్లువెత్తాయి రివ్యూలు కూడా బ్యాడ్ గా వచ్చాయి.

అయితే అక్కడితో ఆగిపోలేదు. సోషల్ మీడియాలోని ఫ్యాన్స్ పేజీలు పవన్ కళ్యాణ్ పై ఎన్నడూ లేనంత దాడి చేశాయి. ఒక సినిమా ఫ్లాఫ్ అయితే ఇక అంతా అయిపోయిందన్న లెవెల్ లో పవన్ కళ్యాణ్ ఇమేజ్ పై దెబ్బ కొట్టే పోస్టులతో చేలరిగిపోయాయి.వీళ్ళంతా పవన్ కు ఏంటీ ఫ్యాన్స్ అనుకోవాలి. కానీ పేజీల పేర్లు మాత్రం పవన్ కళ్యాణ్ పేరుతోనే వుంటాయి. అయితే సంక్రాంతి సినిమాకు కొంత లాభం చేకూరుతుందనే ఉద్దేశంతో వెంకటేష్ నటించిన సన్నివేశాలను సినిమాలో కలపడం జరిగింది.

ఈ క్రమంలో సినిమా కొంతమేర నష్టం రాకుండా ఉంటుందని నిర్మాతలు భావించారు.కానీ ఈ ఆశపై కూడా నీళ్ళు చల్లింది సోషల్ మీడియాలోని దురాభిమానం. అజ్ఞాతవాసిలో యాడ్ చేసిన సీన్లనీ ఇప్పుడు సోషల్ మీడియా ఫ్యాన్స్ పేజీల్లో కనిపిస్తున్నాయి.ఇదంతా చేసేది మాత్రం పవన్ యాంటీ ఫ్యాన్స్ కానీ వారి పేర్లు మాత్రం ఎవరికీ తెలియదు ఒక విధంగా చూసుకుంటే సోషల్ మీడియా సినీ ఇండస్ట్రీకి చాలా చిల్లు పెడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here