పవన్ కళ్యాణ్ ని నా కాళ్ళ దగ్గరకి లాగాబోతున్నా – కత్తి మహేష్

ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్  కు మధ్య వివాదం రోజురోజుకు ముదురుతుంది. ఈ క్రమంలో కత్తి మహేష్ పవన్ తనకు  క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడం జరిగింది . ఈ వివాదంలో ఇప్పటికి నేను కొంత మేర తగ్గించుకుని ఒక మెట్టు దిగను  పవన్ కళ్యాణ్ నేరుగా క్షమాపణలు చెప్పకపోయినా ఒక ట్విట్ చేసిన చాలు అని అంటున్నారు కత్తి మహేష్. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద నేను ఎప్పుడూ ప్రశ్నించలేదు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు నన్ను నా కుటుంబాన్ని నా వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ భయంకరంగా విమర్శిస్తున్నారు అని కత్తి మహేష్ అన్నారు.

‘ప్రజాస్వామ్య దేశంలో నా భావాన్ని నిర్భయంగా వ్యక్తపరిచే హక్కు లేదా?’ అని ప్రశ్నించారు. ఇది స్వతంత్ర దేశం అని ఎవరి వ్యక్తిగత భావన వారు వ్యక్తపరచు కోవచ్చు అని అయితే మహేష్ అన్నారు.ఒకపక్క నేను వివాదానికి తెరదించాలని చూస్తుంటే పవన్ కళ్యాణ్ అభిమానులు వివాదాన్ని ఇంకా పెంచుతున్నారు అని కత్తి మహేష్ అన్నారు.ఇలాంటి అభిమానులు ఉంటె జనసేన పార్టీ మూసుకో వచ్చని కత్తి మహేష్ అన్నారు.’నేనే క‌నుక రోడ్డుపైకి వ‌చ్చి ఆందోళ‌న చేస్తే నా వైపు ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌క‌ సంఘాలు, ద‌ళిత సంఘాలు, బీసీ సంఘాలు ఉంటాయి. అప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణే నా కాళ్ల వ‌ద్ద‌కు రావాల్సి ఉంటుంది. జాగ్ర‌త్తగా ఉండండి. అన‌వ‌స‌ర వ్యాఖ్య‌లు చేయ‌కండి’ అంటూ మ‌హేశ్ క‌త్తి తీవ్రంగా హెచ్చ‌రించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here