జైలుకు షారూక్ ఖాన్ ? .. అతి చిన్నతప్పుకి యావజ్జీవ శిక్ష ?

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ చేసిన అతి చిన్న తప్పు అతన్ని జైల్లో పడేసేలాగా కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం అతను చేసిన పని ఇప్పుడు అతని మెడకి చుట్టుకునేలా ఉంది. తన సినిమా ప్రచారం లో భాగంగా తన ఒంటిమీద ఉన్న టీ షర్టు ని తీసి విసిరేసాడు షారూఖ్. షారూఖ్ టీషర్ట్ విసరడం వలన ఎంత పెద్ద తప్పు జరిగిందో తెలిస్తే షారూఖ్ మీద మీరు కూడా సీరియస్ అవుతారు. ఈ ఏడాది మొదట్లో వచ్చిన షారూక్ రాయీస్ సినిమా ప్రమోషన్ ల కోసం వడోదర కి క్రాంతి ఎక్స్ ప్రెస్ లో వెళ్ళాడు షారూఖ్.

షారూఖ్ ఆత్మ ఊరికి వస్తున్నాడు అని తెలిసి రైల్వే స్టేషన్ నిండిపోయింది. షారూఖ్ ఆ హడావిడి లో జనాల మీదకి టీ షర్టు ని విసిరాడు వాటితో పాటు కొన్ని బాల్స్ కూడా విసిరాడు. ఆ వస్తువులు అందుకోవాలి అనే కంగారు లో అతిపెద్ద తొక్కిసలాట జరిగి ఒక అభిమాని చనిపోయాడు. అంతేకాదు ఇద్దరు సహాయక పోలీసులు జనం మధ్యన పడి సృహ కోల్పోయారు. ఇదంతా కూడా షారుక్ టీ ష‌ర్టులు.. బాల్స్ విసిరేయ‌టం వ‌ల్లేన‌ని వ‌డోద‌ర రైల్వే డీఎస్పీ త‌రుణ్ బ‌రోత్ కోర్టుకు ఇచ్చిన నివేదిక‌లో వెల్ల‌డించారు. ఈ కారణం చేత షారూఖ్ ఖాన్ అరస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని అంటున్నాయ్ బాలీవుడ్ వర్గాలు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here