సినిమా రిలీజ్ అవ్వకుండానే రివ్యూ లని తిట్టి పోస్తున్నాడు

సినిమా స్టార్ లు రివ్యూయర్ ల మీద తిట్టి పోయడం కామన్ విషయం అయిపొయింది. మంచి సినిమా తీసినప్పుడు సినిమాకి పాజిటివ్ గా రాసే రివ్యూ లు సినిమా బాలేక పోతే నిజాలు చెబుతాయి అనే నిజాన్ని మరచిపోతున్న తారలు రివ్యూ రైటర్ లని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఈ జాబితా లో చేరిపోయాడు. సినిమా విడుదల అయిన రోజునే సమీక్షలు రాయడం వలన బోలెడు నష్టం జరుగుతోంది అంటున్నాడు సల్మాన్ ” మా కష్టాన్ని దోచుకుంటున్నారు వాళ్ళు. ఆ హక్కు వాళ్లకి ఎక్కడిది ? ” అంటూ సల్లూ భాయ్ విరుచుకు పడ్డాడు.

క్రిటిక్ ప్రూఫ్ సినిమాలు తీయడమే కుదిరే పని కాదు అనీ తన సినిమాలకి ఒక్కొక్కసారి జెరో రేటింగ్ లు రావడం గుర్తు తెచ్చుకున్నాడు సల్మాన్. మైనస్ రేటింగ్ లు ఇవ్వండి అంటూ యమా సీరియస్ అయిపోయాడు.. ఇంకా తన కొత్త సినిమా ట్యూబ్ లైట్ విడుదల అవ్వకుండా నే సల్మాన్ ఇలా రెచ్చిపోతుంటే ఆ సినిమా విడుదల అయ్యాక ప్లాపయ్యి నెగెటివ్ రివ్యూస్ వస్తే ఏమంటాడో ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here