మహిళా సంఘాల మీద మండిపడుతున్న షకీలా

షకీలా నటించిన `శీల‌వ‌తి’ సినిమా వస్తున్న సందర్భంగా రాష్ట్రంలో కొన్ని మహిళా సంఘాలు షకీలా మీద విరుచుకుపడటం జరిగింది.  ఈ క్రమంలో మాలీవుడ్ సెక్సిణి ష‌కీలా కూడా  మహిళా సంఘాల మీద మండిపడ్డారు. తాను తీసే సినిమాల మీద ఎందుకంత ఆరాటం అంటూ షకీలా తన తాజా సినిమా `శీల‌వ‌తి` ప్రమోషన్ కార్యక్రమంలో మహిళా సంఘాల మీద విరుచుకుపడ్డారు. సినిమాని సినిమాగా చూడాలి అని, సినిమాల పట్ల మహిళా సంఘాల వైఖరి మారాలని కోరారు షకీల. అంతేకాకుండా షకీలా ఇంకా మాట్లాడుతూ “వీళ్ళు అన్నిటిని అన‌వ‌స‌రంగా రాద్ధాంతం చేస్తారు.

సెక్స్ ఎవరికి వద్దు? అందరికీ కావాలి. అయినా వీళ్లకు మాత్రం ఇబ్బంది ఏంటో అర్ధం కాదు. నా సినిమాల విషయంలో జీఎస్టీ సినిమా కి చేసినట్టుగానే వివాదాలు సృష్టించేవారు. గ్లామర్ లేని చోటు ఎక్కడుంది? సినిమాను సినిమా గా మాత్ర‌మే చూడాలి“ అంటూ సీరియ‌స్‌ క్లాస్ ఇచ్చింది.అదేవిధంగా రాంగోపాల్ వర్మ తీసిన జీయస్టీ సినిమా మీద కూడా అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని తన అభిప్రాయాన్ని వెల్లడి చేశారు షకీల. ఈ క్రమంలో  రాంగోపాల్ వర్మ అవకాశం ఇస్తే జీఎస్టీ 2  చేయడానికి సిద్ధమని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.  ఎప్పటినుండో రాంగోపాల్ వర్మ తో సినిమా చేయాలని అది నా చిరకాల కోరిక అని వెళ్లబుచ్చారు షకీలా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here