జై లవకుశ సినిమా తరహాలో రవితేజ సినిమా

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ గత ఏడాది చాలా గ్యాప్ తీసుకుని రాజా ది గ్రేట్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఎప్పటినుండో పరాజయం పరంగా కొనసాగుతున్నా రవితేజ కెరీర్ రాజా ది గ్రేట్ సినిమా తో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో టచ్ చేసి చూడు సినిమా ఈ నెలలో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే దీని తరువాత సోగ్గాడే చిన్నినాయనే ఫేమ్ కళ్యాణ్ కృష్ణ తో చేస్తున్న నేల టికెట్ (వర్కింగ్ టైటిల్), రెండవది శ్రీను వైట్ల తో ఇలా  మంచి స్పీడ్ మీద వున్నాడు రవితేజ.

ఎప్పటినుండో రవితేజకు మూడు పాత్రల్లో నటిచాలనే కోరిక ఒకటి ఉందట. జూనియర్ యన్ టి ఆర్ నటించిన జైలవ కుశ చిత్రం అసలు రవితేజ చేయవలసిందని. కొన్ని కారణాలవల్ల రవితేజ సినిమా నుండి తప్పుకున్నాడు. అయితే ఈ క్రమంలో శ్రీనువైట్లతో చేయబోయే సినిమా లో త్రిపాత్రాభినయంలో కనిపిస్తారట రవితేజ. అయితే ఈ సినిమా చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాడు రవితేజ. డైరెక్టర్ శ్రీనువైట్ల కూడా ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడట. ఎందుకంటే గత కొంతకాలంగా శ్రీను వైట్ల సినిమాలు పరాజయం పాలవడంతో. ఈ సినిమాతో మళ్ళి హిట్ ట్రాక్ ఎకాలని  చూస్తున్నాడు శ్రీను వైట్ల.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here