ఎన్టీఆర్ కోసం ఇందిరాగాంధీని వెతుక్కుంటున్నారు బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ మరొకసారి సంక్రాంతి మొనగాడు అనిపించుకున్నాడు. ఇటీవల సంక్రాంతికి విడుదలైన బాలకృష్ణ నటించిన జై సింహ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ క్రమంలో  జోష్ మీదున్న బాలకృష్ణ. తన తండ్రి ఎన్టీఆర్ జీవిత కథను ఎన్టీఆర్ బయోపిక్ గా సినిమాను చేస్తున్నాడు. అయితే ఈసినిమాను బాలకృష్ణ తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా చిత్రంగా భావిస్తూ తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ని భారీ తారాగణంతో, ప్రొఫెషనల్ సాంకేతిక నిపుణుల తో చేయాలని చూస్తున్నాడు బాలకృష్ణ. అయితే ఎన్టీఆర్ బయోపిక్ సినిమా లో అల‌నాటి ప్ర‌ధాని ఇందిరాగాంధీ పాత్ర కూడా కీల‌కం.

ఇందిరమ్మ పాల‌న‌కు, అజ‌మాయిషీకి ఎదురు నిలిచి.. గెలిచిన నాయ‌కుడు ఎన్టీఆర్‌. క‌నీసం నాలుగైదు స‌న్నివేశాల్లో ఇందిరా గాంధీని చూపించాలి. ఈ క్రమంలో ఇందిరాగాంధీ పాత్రకు ఓ సీనియర్ నటిని  తిసుకుందామని ఆలోచిస్తున్నారు బాలకృష్ణ. ఈ సందర్భంగా ఈ పాత్రకు కొంతమంది పేరులు అనుకుంటున్నారు వారెవరో కాదు న‌దియా, విజ‌య‌శాంతి లాంటి పేర్లు. వీరిలో మరెవరో తుది నిర్ణ‌యం బాల‌కృష్ణ‌నే తీసుకోవాలి.ఈ సినిమాను ఎన్నికల కంటే  ముందే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బాలకృష్ణ భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here