హీరోయిన్ అమలాపాల్ కి లైంగిక వేధింపులు

హీరోయిన్ అమలాపాల్ వరుస వివాదాలతో వార్తలలో సంచలనం సృష్టిస్తుంది. మొన్న ఈ మధ్య నకిలీ పత్రాలతో కారు కొన్న వివాదంలో  అమలాపాల్ ను అరెస్టు చేసే దిశగా ఆ వివాదం తీసుకెళ్లడం వెంటనే బెయిల్ రావడం మనం చూశాం. అయితే తాజాగా హీరోయిన్ అమలాపాల్ ను చెన్నై  ప్రాంతానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త లైంగిక వేధింపులకు పాల్పడ్డాడట. దీంతో అమలాపాల్ ఆ వ్యాపారవేత్త పై పోలీస్ కంప్లైంట్ చేశారు. గత కొద్ది రోజులు తనను లైంగికంగా వేధిస్తున్నారని పోలీసులకు అమలాపాల్ ఫిర్యాదు చేయగా వెంటనే పోలీసులు సదరు వ్యాపారవేత్త పై చర్యలు తీసుకొని అరెస్టు చేశారు.

అసలు వివరాల్లోకి వెళ్తే అలగేశన్ అనే వ్యాపారవేత్త తనను లైంగికంగా వేధిస్తున్నాడని అమలా పాల్ చెన్నైలోని పాండిబజార్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన పోలీసులు అలగేశన్‌ ని అరెస్టు చేశారు. ఈ క్రమంలో అమలాపాల్ అలగేశన్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది తన ఫిర్యాదులో.  అమలాపాల్ మాట్లాడుతూ దేశంలో మహిళలకు రక్షణ లేదని సినిమా తార అయిన నాకే ఇలా ఉంటే సామాన్య మహిళలకు రక్షణ ఎక్కడ అని ప్రశ్నించింది. అంతేకాకుండా దేశంలో మహిళల మీద లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయని దీన్ని అరికట్టడానికి ఇంకా కొత్త చట్టాలు తీసుకురావాలని భారత ప్రభుత్వాన్ని కోరింది అమలాపాల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here