దర్శకుడు ఏది చెబితే అది చేస్తాను: శ్రుతి హాసన్

టాలీవుడ్ కోలీవుడ్ చలనచిత్ర రంగంలో క్రేజీ హీరోయిన్ గా మంచి పేరు సంపాదించింది శ్రుతిహాసన్. అయితే కొన్నాళ్లు ఈ ముద్దుగుమ్మ భాలీవుడ్ ఇండస్ట్రీ లో బిజీ బిజీగా గడుపుతున్న హిందీ సినిమాల మీద ఎక్కువ దృష్టి పెట్టారు. రెండు ఇండస్ట్రీలకు దూరమైందని చెప్పాలి. అలాంటి శ్రుతి హాసన్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. “నేను చేసిన సినిమాలు కొన్ని పరాజయం పాలైతే .. మరికొన్ని సినిమాలు ఘన విజయాలు సాధించాయి. ఈ రెండు రకాల సినిమాల నుంచి నేను కొన్ని అనుభవాలను నేర్చుకున్నాను” అని తన అనుభవాలను పంచుకుంది.

“కొన్ని పాత్రలను ఇష్టపడి చేస్తే .. మరికొన్ని పాత్రలు నచ్చకపోయినా పరిస్థితుల కారణంగా చేయవలసి వచ్చింది. దర్శకుడు ఒక సీన్ గురించి చెప్పినప్పుడు .. మరోలా చేస్తే బాగుంటుంది కదా అనుకుంటాను గానీ, ఆ విషయాన్ని బయటికి చెప్పను. ఎందుకంటే దర్శకుడి పనిలో జోక్యం చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఒక సినిమా పరాజయం పాలైతే అందుకు దర్శకుడు కారకుడనేది నా అభిప్రాయం. సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ కూడా ఆయనకే ఇస్తాను” అంటూ చెప్పుకొచ్చింది.ఏదిఏమైనా దర్శకుడు పట్ల స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కి మంచి గౌరవం ఉందని అంటున్నారు సినిమా విశ్లేషకులు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here