మార్చి నెలలో నాగార్జున, నాని కలిసి షూటింగ్ కు వెళుతున్నారు

టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ పరంపర కొనసాగుతోందని చెప్పవచ్చు. మొన్న రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోలగా ఓ సినిమా రాబోతుంది అని మనకందరికీ తెలుసు ఇప్పటి వరకు ఈ సినిమా అధికార ప్రకటన రాకపోయినా సినిమా మాత్రం ఉందని సమాచారం. అయితే తాజాగా తెలుగు చలనచిత్రరంగంలో మరో మల్టీస్టారర్ సినిమా కి శ్రీకారం చుట్టుకుంది. ఈ సినిమా నాగార్జున,నాని హీరోలుగా ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతుంది. అయితే సినిమా ఎప్పుడు షూటింగ్ జరుపుకుంటుందా అని అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమాను వచ్చేనెల 24వ తేదీన సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాగార్జున మాఫియా డాన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో, నాని డాక్టర్ గా కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ల కోసం వెతుకుతున్నారు  సినిమా యూనిట్. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సమ్మర్ కి రిలీజ్ చేయడానికి సన్నహాలు చేస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here