జూలైలో రామ్ చరణ్ బోయపాటి సినిమా

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి సినిమా అంటే మాస్ ప్రేక్షకులకు ఫుల్ మిల్స్ లాంటిది. అయితే ఈ సెన్సేషనల్ డైరెక్టర్ ఇప్పుడు పక్కా ప్లానింగ్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరో గా సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. స్క్రిప్టు వర్క్ మొత్తం పక్కాగా రెడీ చేసుకొని మొదటి షెడ్యూల్ని హీరో రామ్ చరణ్ లేకుండానే పూర్తిచేశాడు. చరణ్ రంగస్థలం సినిమా మీద కొద్దిగా వర్క్ ఉండడంతో బిజీగా ఉండటంతో, ఆయన పాత్ర ప్రమేయం లేని సన్నివేశాలతో అప్పుడే బోయపాటి ఒక షెడ్యూల్ ను పూర్తి చేశాడు.

చరణ్ తో వచ్చేవారం రెండవ షెడ్యూల్ కి రెడీ అవుతున్నాడు. చరణ్ పనులను బట్టి షెడ్యూల్స్ ను ప్లాన్ చేసుకున్న బోయపాటి, జూన్ చివరినాటికి అన్ని పనులను పూర్తి చేసి, జూలైలో విడుదల చేయాలనే ఆలోచనతో వున్నాడని చెబుతున్నారు. అయితే ఈ సంవత్సరం మార్చి నెలలో వస్తున్న రంగస్థలం తోపాటు బోయపాటి శ్రీను కూడా జూలైలో తన సినిమాని దింపేస్తున్నారు. మొత్తం మీద పెద్ద గ్యాప్ లేకుండా రాంచరణ్ ఈ సంవత్సరం రెండు సినిమాలు దింపుతున్నాడు అన్నమాట. ఏదిఏమైనా మెగా అభిమానులకు ఈ సంవత్సరం పెద్ద పండుగ అని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here