కమల్ హాసన్ పిలిస్తే వెళ్తా: షకీలా

తమిళ రాజకీయాల్లో ఇటీవల అడుగుపెట్టిన కమల్ హాసన్ పై షకీలా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా షకీలా మాట్లాడుతూ నటుడు కమలహాసన్ కి సమాజం మీద ఎక్కువ అవగాహన ఉందని తెలిపింది…కమల్ ఒక మంచి మానవత్వం కలిగిన వ్యక్తి. సామాన్య ప్రజలను విద్యా వంతులను చైతన్యవంతులను చేయాలనీ తరచు చెబుతుంటారు.
ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనమంటే తప్పకుండా తాను వెళతాను అని షకీలా వివరించారు. కమల్ హాసన్ రాకవల్ల తమిళ రాజకీయాల్లో మార్పు వస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంతటి మంచి వ్యక్తులను ప్రోత్సహించాలని అన్నారు. అంతేకాకుండా కమల్ హాసన్ లాంటి వ్యక్తులు ఇంకా రాజకీయాలలోకి రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు షకీలా. ప్రస్తుతం షకీలా శీలవతి అనే సినిమా చేస్తుంది. షకీలా కెరీర్ లో ఇది 250 వ చిత్రం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here