వెండితెరపై సన్నీలియోన్ జీవితం

ఇండియన్ పోర్న్ స్టార్ సన్నీలియోన్ జీవిత కథ త్వరలో వెండి తెరపై ఆవిష్కృతమవుతుంది. భారతీయ శృంగార ప్రేమికులకు సుపరిచిత పేరు సన్నీ లియోన్. బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ బాంబ్ గా పేరున్న సన్నీ లియోన్ గూగుల్ సెర్చ్ ఇంజన్ లో, సోషల్ మీడియాలో అనేక సంచలనాలు సృష్టించింది. ఈ క్రమంలో సన్నీ లియోన్ జీవితం త్వరలోనే తెరపై ఆవిష్కృతం కానుంది. అయితే అది సినిమాగా కాదు. వెబ్ సిరీస్‌ రూపంలో  ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆమె అసలు పేరు ‘కరణ్‌జీత్ కౌర్’. ఇప్పుడు తీయనున్న వెబ్ సిరీస్‌కు ‘కరణ్‌జీత్’ పేరు పెట్టినట్లు తెలిసింది. ఇందులో టైటిల్ రోల్‌ సన్నీ పోషిస్తుందా? లేదా మరెవరైనా పోషిస్తారా? అనేది ప్రస్తుతానికైతే సస్పెన్సే. ఈ వెబ్ సిరీస్ విషయాన్ని సన్నీయే స్వయంగా ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ సిరీస్‌లో సన్నీలియోన్ గురించి బయటి ప్రపంచానికి తెలియని సన్నీలియాన్ జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలను  తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here