వైసీపీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్న యువత

వైయస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రకాశం జిల్లా ముగించుకొని గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో జగన్ ప్రజలతో మమేకమవుతు వారి కష్టాలను బాధలను వింటూ వారిలో భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో వైసీపీ అభిమానులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా స్టువర్టుపురంలో నిర్వహించిన వైసీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలలో జగన్‌ పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతి, శాసనమండలి సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గుంటూరు జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యువత పెద్దయెత్తున తరలివచ్చారు. మహిళలు జగన్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. అయితే వైఎస్ జగన్ కు గుంటూరు జిల్లాలో భారీగా యువత హాజరవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో ఉన్న యువత ఎక్కువగా వైసీపీ పార్టీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.
గత ఎన్నికలలో ప్రముఖ పాత్ర పోషించింది కొత్త ఓట్లయినా యువత ఓట్లు. దాదాపు 20 లక్షల ఓట్లు గత సార్వత్రిక ఎన్నికలలో కొత్తగా వచ్చాయి. అయితే ఈ క్రమంలో రాష్ట్రంలో జగన్ చేస్తున్న పాదయాత్రలో ఎక్కువగా కనబడుతున్నది యువత. ఈ క్రమంలో వైఎస్ జగన్ ను 2019 లో ముఖ్యమంత్రిని చెయ్యడంలో యువత ఓట్లు ప్రముఖ పాత్ర ఉండబోతుందని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాకుండా జగన్ వస్తే ఉద్యోగాలు కచ్చితంగా వస్తాయని చాలా ప్రగాఢంగా నమ్ముతున్నారు యువత.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here