తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెబుతున్న కీలక నేతలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో తీసుకున్న నిర్ణయాలు తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో రాజ్యసభ సీటు ఇస్తానని చివరి వరకు ఆశ కల్పించిన వర్ల రామయ్యకి టీడీపీ మొండిచెయ్యి చూపించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు వర్ణ రామయ్య. ఈ క్రమంలో వల్ల రామయ్య మాట్లాడుతూ దళితుడు నైన  అందుకు నన్ను tdp అవమానించిందని అన్నారు. అంతేకాకుండా పార్టీ కోసం కోట్లు త‌గ‌లేసి, వైఎస్ జ‌గ‌న్‌ను బ‌ద్నాం చేయ‌డానికి వివాద‌లు నెత్తిన పెట్టుకున్నా.. త‌న‌కు చంద్ర‌బాబు అన్యాయం చేశాడ‌ని వ‌ర్ల రామ‌య్య మండిప‌డుతున్నాడు.
టీడీపీ పార్టీ త‌న‌కు కేటాయించిన ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. అయితే, రాజీనామాపై టీడీపీ నేత‌లు ఎంత స‌ర్దిచెప్పినా వ‌ర్ల‌రామ‌య్య మాత్రం రాజీనామాకే మొగ్గు చూపుతున్నారు. మరి అదే విధంగా వల్ల రామయ్యతో పాటు ఆశ పెట్టుకున్న బీద మ‌స్తాన్‌రావు కూడా టీడీపీకీ రాజీనామా చేయ‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాప‌య‌డుత‌న్నారు. ప్రస్తుతం వీరిద్దరి వ్యవహారం తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబుకి తలనొప్పిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here