సునీల్ హీరోగా రాఘవేంద్రరావు చిత్రం

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మరో భక్తి చిత్రానికి శ్రీకారం చుట్టాడు. డైరెక్టర్ రాఘవేంద్రరావు చివరి సినిమా నాగార్జున నటించిన ఓం నమో వెంకటేశాయ. ఈ సినిమాయే కాకుండా అన్నమయ్య, శ్రీరామదాసు, మంజునాథ, పాండురంగ మహత్యం. షిరిడి సాయి ఇలాంటి సినిమాలెన్నో తెరకెక్కించాడు రాఘవేంద్రరావు. అయితే ఈ క్రమంలో కమెడియన్ సునీల్ ప్రధాన పాత్రలో రాఘవేంద్రరావు మరో భక్తి చిత్రానికి రెడీ అయినట్టు తెలుస్తోంది.
అయితే ఈ మధ్య వరుస పరాజయాలతో టెన్షన్ మీదున్న సునీల్ మళ్ళీ బ్యాక్ టూ పెవిలియన్ అంటూ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రాఘవేంద్ర రావు సునీల్ తో భక్తి సినిమా చేస్తాననడం ఆసక్తి కరంగా మారింది. ఈ సినిమాకి మరో విశేషమేమిటంటే సునీల్ తో పాటు హీరో వెంకటేష్ కూడా నటిస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్టు రాస్తున్నాడు రాఘవేంద్రరావు. త్వరలోనే ఈ సినిమా అధికారిక ప్రకటన వెలువడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here