పండగల చేస్తున్న ‘భరత్ అనే నేను’ ప్రమోషన్ కార్యక్రమాలు

మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమా టీజర్ సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టిస్తోంది. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన శ్రీమంతుడు భయంకరంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన నేపథ్యంలో భరత్ అనే నేను సినిమా పై  అభిమానులకు అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. వరుస ఫ్లాపులతో ఉన్న మహేష్ బాబు ఈ సినిమాతో కచ్చితంగా హిట్టు కొట్టాలని అనుకుంటున్నాడు.
ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్ ని డిఫరెంటుగా చేయబోతున్నారు సినిమా యూనిట్. భరత్ అనే నేను సినిమాకు ఏకంగా 20 రోజుల పాటు ఎక్స్ క్లూజివ్ గా ప్రమోషన్ ఇవ్వాలని నిర్ణయించారట. ఏప్రిల్ 1నుంచి సినిమా విడుదలైన రోజు వరకు ఏదో ఒక రూపంలో ఈ సినిమాకి ప్రచారం కల్పించబోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు 20 రోజులకు సరిపడా యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసిందట యూనిట్. ప్రేక్షకుల్ని ఆకర్షించడం కోసం ప్రతి రోజు ఏదో ఒకటి కొత్తగా చేయబోతున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తున్నాడు. ఏప్రిల్ 20 న విడుదలవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here