‘మన్నత్‌’ అమ్మేది కాదు.. ఇచ్చేది.!

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ ఇంటి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ‘మన్నత్‌’ పేరుతో నిర్మించిన ఈ ఇంటి నిర్మాణంపై రకరకాల కథనాలు వస్తుంటాయి. సుమారు రూ.రెండు వందల కోట్ల విలువ చేసే అత్యంత విలాసవంతమైన ఇళ్లు ఇది. ముంబయిలో ఉన్న ఖరీదైన బంగ్లాల్లో ఇదీ ఒకటి. ఈ ఇంటిపై అడపాదడపా చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇక నెటిజన్లు కూడా అప్పుడప్పుడు షార్‌ఖ్‌ను ఈ ఇంటి గురించి అడుగుతూనే ఉంటారు. వాటికి షార్‌ఖ్‌ కూడా ఫన్నీ సమాధానాలిస్తుంటాడు. గతంలో ఓసారి ఓ అభిమాని ‘మన్నత్‌’కు ఎంత ఖర్చయింది అన్న ప్రశ్నకు షార్‌ఖ్‌ సమాధానమిస్తూ.. ‘25 ఏళ్ల నా కష్టం’ అని సమాధానమిచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు.

అయితే తాజాగా అలాంటి ఓ ప్రశ్నకే సమాధానమిచ్చి నవ్వులు పూయించాడీ బాలీవుడ్‌ బాద్‌షా. షారుఖ్‌ తాజాగా ట్విట్టర్‌ వేదికగా ‘ఆస్క్‌ ఎస్‌ఆర్‌కే’ పేరిట ఫ్యాన్స్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని.. ‘భాయ్‌ మన్నత్‌ను అమ్మేస్తున్నారా ఏంటి?’ అంటూ సందేహం వ్యక్తం చేయగా.. దానికి స్పందించిన షారుఖ్‌.. ‘మన్నత్‌ను ఎప్పుడూ ఎవరూ అమ్మలేరు.. ఇస్తారు.. ఈ విషయం నువ్వు గుర్తుపెట్టుకున్నట్లయితే జీవితంలో అనుకున్నవని సాధిచంగలుగుతావు’అని చమత్కరించాడు. కాగా మన్నత్‌ అంటే హిందీలో వాగ్దానం (మాట ఇవ్వడం) అని అర్థం. ఈ విధంగా మన్నత్‌ను అమ్ముతావా అన్న అభిమాని ప్రశ్నకు సుతిమెత్తగా సమాధానమిచ్చాడు షారుఖ్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here