జెర్సీ రీమేక్ కోసం షాహిద్ అంత తీసుకుంటున్నాడా.?

నాని హీరోగా వచ్చిన ‘జెర్సీ’ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జీవితంలో తను కన్న కలల్ని సాధించే క్రమంలో ఒక క్రికెటర్ ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.

తెలుగులో నాని పోషించిన పాత్రను హిందీలో షాహిద్ పోషిస్తున్నాడు.

ఇదిలా ఉంటే షాహిద్ కపూర్ ఈ సినిమాకు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.  షాహీద్ కపూర్ ఈ సినిమా కోసం ఏకంగా రూ. 35 కోట్లు వసూలు చేస్తున్నాడని టాక్. అంతే కాదు ఈ సినిమా లాభాల్లో కూడా వాటా తీసుకోబోతున్నట్లు చెబుతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే ఎంతకాదన్న షాహిద్ ఈ సినిమాకు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ రూ. 50 కోట్లకు పైమాటే అన్నమాట. తెలుగులో సూపర్ సక్సెస్ అందుకున్న జెర్సీ హిందీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here