సీఎం జగన్ చారిత్రాత్మక నిర్ణ‌యం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి డిజిట‌ల్ పేమెంట్స్‌ను ప్రారంభించారు. గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో అందే సేవ‌ల‌కు సంబంధించి ఇప్ప‌టి నుంచి డిజిట‌ల్ పేమెంట్స్ చేయ‌వ‌చ్చు. గ్రామాల్లో డిజిట‌ల్ పేమెంట్స్‌పై సీఎం తీసుకున్న నిర్ణ‌యం చారిత్ర‌క‌మైన‌ద‌ని చెప్ప‌వ‌చ్చు.

రాష్ట్రంలో 15,004 సచివాలయాల్లో డిజిటల్‌ లావాదేవీలు మొద‌ల‌య్యాయి. గ్రామ వార్డు, సచివాలయాల్లో ప్రస్తుతం 543 రకాల సేవలను ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెలిసిందే. వినియోగదారులు ఇక నుంచి ఈ సేవలను అవసరమైతే డిజిటల్‌ పేమెంట్‌ ద్వారా చెల్లింపులు జరపవచ్చు. అయితే ఇందులో పెద్ద గొప్ప ఏముంది అనుకోవ‌చ్చు.

దేశంలో గ‌త రెండేళ్ల‌లో డిజిట‌ల్ లావాదేవీలు 50 శాతం పెరిగాయ‌ని ఆర్బీఐ తాజాగా పేర్కొంది. అయితే ఇందులో న‌గ‌రాల్లోని వారే అధికంగా ఉన్నారు. దీన్ని బ‌ట్టి గ్రామీణ ప్రాంతాల్లో మాత్ర‌మే డిజిట‌ల్ లావాదేవీల పాత్ర అంత ఆశాజ‌న‌కంగా లేద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇప్పుడు ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం ద్వారా స‌చివాల‌యాల్లో ఎలాంటి లావాదేవీలు జ‌ర‌పాల‌న్నా న‌గ‌దుతో లేకుండా ఆన్‌లైన్ ద్వారానే జ‌ర‌ప‌వ‌చ్చు.

డిజిట‌ల్ పేమెంట్ల వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు టెక్నాల‌జీని అందించ‌న‌ట్లైంది. ఇప్ప‌టికే ప‌లు సేవ‌లు బ్యాంకుల‌కు లింక్ చేసిన ప్ర‌భుత్వం.. తాజాగా తీసుకున్న నిర్ణ‌యం ద్వారా ఆంధ్ర‌ప్ర‌దేశ్ సాంకేతికంగా మ‌రో ముంద‌డుగు వేసింద‌ని చెప్ప‌వ‌చ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here