ఫేస్‌బుక్ స్పందించింది..

త‌న‌పై వస్తున్న ఆరోప‌ణ‌ల‌పై సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌బుక్ స్పందించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, హిందూవాదానికి అనుగుణంగా ఫేస్‌బుక్ వ్యవహరిస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్‌లో ప్ర‌చురిత‌మైన విష‌యం తెలిసిందే. దీనిపై ఫేస్‌బుక్ ప్ర‌తినిధి స్పందించారు.

త‌మ సంస్థ విధానాలు వ్య‌క్తులు, రాజ‌కీయ పార్టీ, స్థాయిల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా అమ‌లు చేస్తున్నామ‌ని ఫేస్ బుక్ ప్ర‌తినిధి తెలిపారు. హింస‌ను ప్రేరేపించే విద్వేష‌పూరిత ప్ర‌సంగాలు, అభ్యంత‌ర‌క‌ర పోస్టుల‌ను నిషేధించిన‌ట్లు పేర్కొన్నారు. త‌మ విధానాల్లో ఇంకా పురోగ‌తి సాధిస్తున్నామ‌ని. ఇంకా మెరుగుపరుచుకోవాల్సి ఉంద‌న్నారు.

కాగా నిన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ల‌ను బీజేపీ..ఆర్ఎస్ఎస్ అదుపుచేస్తున్నాయ‌న్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, విధ్వేష ప్రసంగాలను బీజేపీ ప్రచారం చేస్తోందన్నారు. అయినప్పటికీ వారిపై తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. ఈ నేప‌థ్యంలో ఫేస్‌బుక్ స్పందించి క్లారిటీ ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here