రాబోతున్నక్రేజీ మ‌ల్టీస్టార‌ర్..?

మ‌ల్టీస్టార‌ర్ సినిమా వ‌స్తోందంటే అది అభిమానుల‌కు పండ‌గే. ఇక స్టార్ హీరోలే మ‌ల్టీస్టారర్‌లో న‌టిస్తుంటే ఆ సినిమా ఎలా ఉంటుందో చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పుడు ర‌జినీకాంత్, క‌మ‌ల‌హాస‌న్ ఇద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్న సినిమాపై డిస్క‌ష‌న్ న‌డుస్తోంది.

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌, లోక నాయ‌కుడు క‌మ‌ల‌హాస‌న్ ఇద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ సినిమాకు సంబంధించి వ‌ర్క్ వేగంగా జ‌రుగుతోంది. డైరెక్ట‌ర్ క‌న‌గ‌రాజ్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. మూవీ స్క్రిప్టును రెడీ చేసే ప‌నిలో బిజీగా ఉంది యూనిట్‌. మ‌రో రెండు నెల‌ల్లో సినిమాకు సంబంధించి పూర్తి క్లారిటీ వ‌స్తోంద‌ని చెన్నై టాక్‌.

ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ బ‌డ్జెట్ రూ. 200 కోట్లు ఉండే అవ‌కాశం ఉంది. దాదాపు మూడు ద‌శాబ్దాల క్రితం ఓ సినిమా వ‌చ్చింది. ఇందులో ర‌జినీకాంత్‌, అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్‌లు హీరోలుగా గిర‌ఫ్తార్ సినిమా వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఇప్పుడు మ‌ళ్లీ ర‌జినీ, క‌మ‌ల్ క‌లిసి న‌టిస్తోన్న ఈ సినిమాపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. డైరెక్ట‌ర్ క‌న‌గ‌రాజ్‌పైనే అంద‌రి చూపు నెల‌కొంది.

రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో ఎన్‌.టి.ఆర్‌., రామ్ చ‌ర‌ణ్ మ‌ల్టీస్టార‌ర్ కోసం అభిమానులు వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు రజినీ, క‌మ‌ల్ మూవీ వ‌ర్క్ స్టాట్ అవుతోంద‌న్న వార్త‌ల‌తో ఈ సినిమా గురించి డిస్క‌ష‌న్ ఎక్కువైంది. సినిమాకు సంబంధించి హీరోయిన్లు, ఇత‌ర న‌టీన‌టులు ఎవ‌ర‌న్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే స్క్రిప్టు వ‌ర్క్ మాత్రం వేగంగా జ‌రుగుతోంద‌ని స‌మాచారం. మ‌రికొద్ది రోజుల్లోనే ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ డీటెయిల్స్ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here