600 ఏళ్ల పాటు జైలు శిక్ష వేసినా త‌క్కువేన‌ట‌..

కామాంధుల‌కు అమెరికాలో క‌ఠిన శిక్ష‌లు అమ‌ల‌వుతున్నాయి. చిన్నారుల‌పై లైంగిన నేరాల‌కు పాల్ప‌డుతున్న ఓ వ్య‌క్తికి అమెరికా డిస్ట్రిక్ జ‌డ్జి 600 సంవ‌త్స‌రాల పాటు జైలు శిక్ష వేశారు. ఇంత పెద్ద శిక్ష వేసిన ఈ కేసులో ఏం జ‌రిగిందోనన్న ఆతృత‌తో ఈ వార్త ఇప్పుడు హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

మ్యాథ్యూ టైల‌ర్ మిల్ల‌ర్ అనే వ్య‌క్తి చిన్నారుల‌ను లైంగిక చ‌ర్య‌ల‌కు ఉసిగొల్పి వాటిని వీడియో తీస్తూ ఉండేవాడు. ప‌లువురిపై అత్యాచారానికి కూడా పాల్ప‌డ్డారు. వంద‌ల మంది పిల్ల‌ల‌ను ఆయ‌న లైంగిక చ‌ర్య‌ల‌కు రెచ్చ‌గొట్టారు. అనంత‌రం వీడియోలు తీస్తాడు. 2014 నుంచి 2019 మ‌ధ్య కాలంలో ఈ ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డ్డారు. నాలుగు సంవ‌త్స‌రాల వ‌య‌స్సున చిన్నారుల నుంచి మొద‌లుకొని అంద‌రినీ లైంగికంగా వేధించేవారని తెలిసింది.

దీంతో ఈయ‌న్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇత‌న్ని విచారించ‌గా ఈ విష‌యాల‌న్నీ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇత‌ని వ‌ద్ద వంద‌ల వీడియోలు దొరికాయ‌ని పోలీసులు తెలిపారు. ఈ వీడియోల‌న్నీ చిన్నారుల అశ్లీల వీడియోలే. దీంతో కోర్టు ఈ కేసు విచారించి 600 సంవ‌త్స‌రాల పాటు జైలు శిక్ష విధించింది. ఇది తెలుసుకున్న వారంతా ఇలాంటి వారికి ఇది కూడా త‌క్కువే అంటున్నారు. లైంగిక నేరాలు ఎక్కువ‌వుతున్న‌ ఇండియాలో కూడా ఇలాంఠి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here