సీఎం జ‌గ‌న్ మామ క‌న్నుమూత‌..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్ జ‌గ‌న్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. జ‌గ‌న్ మామ ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. ఈయ‌న జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తికి తండ్రి. ఇటీవల ఆయ‌న అనారోగ్యం కార‌ణంగా ఆసుప‌త్రిలో చేరారు. హైద‌రాబాద్‌లోని హాస్పిట‌ల్‌లో ఉన్న ఆయ‌న్ను వై.ఎస్ జ‌గ‌న్ వెళ్లి చూసి వ‌చ్చిన‌ విష‌యం తెలిసిందే.

కాగా తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయ‌న‌ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూనే క‌న్నుమూశారు. ఈయ‌న పులివెందుల ప‌ట్ట‌ణంలో మంచి వైద్యుడిగా పేరు సంపాదించుకున్నారు. 2001..2005లో పులివెందుల ఎంపీపీగా ఆయ‌న ప‌నిచేశారు. 2003లో రైతుల‌కు ర‌బీ విత్త‌నాల కోసం పులివెందుల నుంచి క‌డ‌ప క‌లెక్ట‌రేట్ వ‌ర‌కు ఆయ‌న పాద‌యాత్ర కూడా చేశారు. కాగా అర్ద‌రాత్రి తుది శ్వాస విడిచార‌న్న వార్త‌తో ఆయ‌న అభిమానులు విషాదంలో మునిగిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here