పవన్ కళ్యాణ్ నాజూకు గా అవ్వడానికి మెయిన్ రీజన్ ఇదే .. సూపర్ సీక్రెట్ ఫుడ్ :

సినిమాల్లోకి ఎంటర్ అయిన టైం నుంచీ పెద్ద మార్పులు లేని ఫిజిక్ మైంటైన్ చేస్తున్నాడు హీరో పవన్ కళ్యాణ్. ఒకే షేప్ ఒకే ఫిజిక్ తో ఉండడం పవన్ కళ్యాణ్ ఓన్ స్టైల్. అలాంటి పవన్ కళ్యాణ్ ఈ మధ్యన వచ్చిన కాటమరాయుడు సినిమాలో కాస్త బొద్దుగా కనపడ్డాడు. అతని ఇదివరకటి సినిమాలతో పోలిస్తే డీ గ్లామర్ గా ఉన్నాడు ఈ చిత్రం లో. విమర్శకులు కూడా పవన్ ఇన్నేళ్ళలో ఇతర హీరోల లాగా లావు అవ్వడం లేదు అనీ ఇది కొత్త పరిణామం అనీ అన్నారు.

అయితే పవన్ – త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో కళ్యాణ్ కొత్త గెటప్ లో కనపడ్డాడు. ఈ మధ్యన పూర్తిగా అన్నం తినడం మానేసిన పవన్ కళ్యాణ్ క్యాలరీ ఫుడ్ ని పూర్తిగా వదిలేశాడట. బరువు తగ్గడం కోసం లిక్విడ్స్ మీద దృష్టి పెట్టిన కళ్యాణ్ ఈ ప్రాసెస్ లో భాగంగానే సన్నబడ్డాడు అని తెలుస్తోంది. ఏదేమైనా పవన్ ని తనకి తగ్గట్టుగా తగ్గేలా చేసుకున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. పూర్తిగా తన హీరో క్యారెక్టర్ కోసం ఒక సాఫ్ట్ వేర్ లుక్ లోకి కళ్యాణ్ ని తీసుకొచ్చాడు త్రివిక్రమ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here