హిందీ లో త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ సినిమా .. ఎంత రేటు పలికిందో ఊహించ గలరా ?

హిందీ పరిశ్రమ మీద కాదు కానీ హిందీ మార్కెట్ మీద పవన్ కళ్యాణ్ కళ్ళు బాగానే పడ్డాయో. పోయిన సంవత్సరం సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ని హిందీ లో డబ్ చేయించి నార్త్ లో విడుదల చేసాడు కళ్యాణ్. దానివలన ఆ సినిమాకి పెద్ద ప్రయోజనం ఏమీ ఏర్పడలేదు. కాటమరాయుడు సినిమా పూర్తి మాస్ వెంచర్ అవడం తో అలా ప్రయత్నం ఏమీ చెయ్యలేదు అతను. త్రివిక్రమ్ తో రాబోతున్న కొత్త సినిమాని హిందీ లోకి తీసుకుని వెళ్ళే విషయం లో మనోడు కాస్తంత సీరియస్ గానే ఉన్నాడు అని టాక్.

ఇప్పటికే హిందీ డబ్బింగ్ పనులు కూడా మొదలెట్టారు అనీ ఈ సినిమాని అక్కడ 11 కోట్లకి అమ్మేసారు అని టాక్ వినిపిస్తోంది. సర్దార్ కి అక్కడ డిజాస్టర్ వచ్చిన తరవాత పవన్ కొత్త చిత్రానికి 11 కోట్లు రావడం అంటే చిన్న విషయం కాదు. బాహుబలి దెబ్బతో అక్కడ తెలుగు సినిమాలు అంటే ఇంటర్స్ట్ పెరిగిన విషయం వాస్తవమే మరి. దువ్వాడ జగన్నాథం కి హిందీ శాటిలైట్ ఒక్కటే ఏడు కోట్లు పలికింది అంటే చూస్కోండి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here