బాలీవుడ్ లో మరో సినిమా చేయనున్న సందీప్ వంగా..

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఒక్కసారి ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు సందీప్ వంగా. బోల్డ్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా యువతను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఇదే సినిమాను బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం సందీప్ వంగా హిందీలో మరో చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కి సందీప్ ఒక కథను చెప్పినట్లు.. రణబీర్ కపూర్ కూడా సినిమా చేయడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాని నిర్మాత టీ-సిరీస్ భూషణ్ కుమార్, సినీ 1 స్టూడియోస్ మురాద్ ఖేతాని కలిసి భారీ స్థాయిలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రంలో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నాడట. ఇక ఈ సినిమాకి అర్జున్ రెడ్డి నిర్మాత ప్రణయ్ వంగా కూడా నిర్మాణ బాధ్యతలు పంచుకోనున్నాడని సమాచారం. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here