గ్యాస్ ధ‌ర‌ల‌పై అవ‌గాహ‌న లేని రాజ‌కీయాలు…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ్యాస్ ధ‌ర‌లు పెరిగిపోయాయంటూ వ‌చ్చిన వార్త‌ల్లో సామాన్యులు ఆందోళ‌న చెందారు. అయితే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం అవ‌గాహ‌న లేని నేత‌లు, మీడియా సంస్థ‌లు త‌ప్పుగా ప్ర‌చారం చేయ‌డ‌మే. అస‌లు ప్ర‌భుత్వం ఏ గ్యాస్ ధ‌ర‌లు పెంచింద‌న్న‌ది తెలుసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడ‌టంతో జ‌నాల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లపాల‌వుతున్నారు.

ఏపీ ప్ర‌భుత్వం నేచుర‌ల్ గ్యాస్‌పై స్వ‌ల్పంగా ట్యాక్స్ పెంచింది. ఇది ప‌రిశ్ర‌మ‌ల‌కు, విద్యుత్ ఉత్ప‌త్తికి వినియోగించే గ్యాస్ మాత్ర‌మే. ఎల్‌.పి.జి గ్యాస్ ధ‌ర పెంచలేదు. కానీ అవ‌గాహ‌న లేని వారంతా ఎల్‌పిజి గ్యాస్ ధ‌ర పెంచేసి సామాన్య ప్ర‌జ‌ల‌పై ప్ర‌భుత్వం భారం మోపింద‌ని ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు. ప్రభుత్వంపై బుర‌ద‌జ‌ల్ల‌డ‌మే ప‌నిగా పెట్టుకున్న టిడిపి నేత‌లు ఈ అవ‌కాశాన్ని క్యాష్ చేసుకోవాల‌నుకొని అడ్డంగా బుక్క‌య్యారు.

టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ ఓ ట్వీట్ చేశారు. ప్ర‌భుత్వం గ్యాస్ ధ‌ర పెంచేసింద‌న్నారు. అయితే దీనిపై రివ‌ర్స్ కౌంట‌ర్లు వ‌చ్చాయి. వైసీపీ నేత విజ‌య‌సాయిరెడ్డి స్పందిస్తూ లోకేశం ఎల్పీజీకి, న్యాచుర‌ల్ గ్యాస్‌కు తేడా తెలియ‌దా అని ప్ర‌శ్నించారు. న్యాచుర‌ల్ గ్యాస్ వ్యాట్‌లో మార్పులు జ‌రిగితే ఎల్పీజీపై అని దుష్ప్ర‌చారం చేయిస్తావా అన్నారు. అస‌లు ఎల్పీజీపై ట్యాక్స్ రాష్ట్రం ప‌రిధిలోనికి వ‌స్తుందా అన్నారు. ఇక ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కూడా దీనిపై స్పందించారు. నారా లోకేష్ ఎంత చ‌దువ‌కొని ఏం ఉప‌యోగ‌మ‌ని..వ్యాట్ పెంచుతూ ఇచ్చిన జీవో కూడా చ‌ద‌వ‌కుండా లోకే్‌ష ట్వీట్ చేస్తారా అన్నారు.

రాష్ట్ర ప్ర‌భుత్వ స్పెషల్ సీఎస్ ర‌జ‌త్ భార్గ‌వ్ క్లారిటీ ఇచ్చే వ‌ర‌కు రాజ‌కీయ నాయ‌కుల‌తో పాటు ప్ర‌జ‌లు కూడా ఆందోళ‌న‌లోనే ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే నేత‌లు చేసే కామెంట్ల వ‌ల్ల ప్ర‌జ‌లు అయోమ‌యంలో ప‌డిపోయారు. ఇళ్ల‌ల్లో వాడే గ్యాస్ ధ‌ర‌ను ప్ర‌భుత్వం పెంచ‌లేద‌ని ఆయ‌న చెప్పారు. కొంద‌రు అవ‌గాహ‌న లేక దుష్ప్ర‌చారం చేస్తున్నార‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here