క‌రోనా వైర‌స్ చిత్రాలు విడుద‌ల‌.. కోట్ల‌లో వ్యూస్‌..

క‌రోనా ఈ పేరు వింటేనే ప్ర‌పంచం వ‌ణికిపోతోంది. అలాంటిది ఆ వైర‌స్ ఒక వేళ మ‌నం చూడాల్సి వ‌స్తే ఎంతో మంది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. తాజాగా శాస్త్ర‌వేత్త‌లు క‌రోనా వైర‌స్ ఫోటోలను బ‌య‌ట‌కు తీశారు. దీంతో అది ఎలా ఉందో అని తెలుసుకోవ‌డానికి కోట్లాది మంది నెటిజ‌న్లు సెర్చ్ చేస్తున్నారు.

మ‌నిషి శ్వాసనాళాల్లో కరోనా వైరస్ ను ప్రవేశపెట్టి మూడు రోజుల త‌ర్వాత అత్యంత శక్తివంతమైన స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా కరోనా కణాలను పరిశీలించారు.  న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసన్ లో ఈ చిత్రాలు ప్రచురితమయ్యాయి. మాస్కుల ద్వారానే కోవిడ్ ను నియంత్రించవచ్చని ఈ పరిశోధన ద్వారా తేలిందని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. వైర‌స్ పిక్స్ చూసిన వారంతా హ‌డ‌లెత్తిపోతున్నారు. చూడ్డానికి మామూలుగా క‌న‌పించినా మ‌హా డేంజ‌ర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఊపిరితిత్తుల లోపల కణాల్లోకి వైరస్ కణాలు ఏ మేరకు చొచ్చుకుపోయి వ్యాధి కారక కణాలను ప్రేరేపిస్తాయో గుర్తించారు. మానవ శ్వాసనాళాల్లో పెద్దసంఖ్యలో వైరస్ కణాలు శరీరమంతా వ్యాపించడంతోపాటు ఇతరులకు సంక్రమించేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి ఈ చిత్రాల్లో పరిశోధకులు కళ్లకు కట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here