పూజా స్థానాన్ని రీప్లేస్‌ చేస్తున్న సమంత..?

జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో ఇది వరకు వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇలాంటి హిట్‌ కాంబినేషన్‌లో మరో సినిమా రానుండడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకోనున్నారని కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. దీంతో ‘అరవింద’ కాంబినేషన్‌ మళ్లీ రిపీట్‌ అవుతుందని అంతా భావించారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్‌గా నటి సమంతను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్‌, సమంత కాంబినేషన్‌ ఇంతకుముందు వచ్చిన.. రభస, బృందావనం, రామయ్య వస్తావయ్యా, జనతా గ్యారేజ్‌ వంటి చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. చిత్రంలోని కీలక సన్నివేశాలన్నీ అక్కడే చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రీకరణలో బిజీగా ఉన్న ఎన్టీఆర్‌ అనంతరం త్రివిక్రమ్‌తో చేతులు కలుపనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here