కియారా బ్రేకప్‌ లవ్‌ స్టోరీ విన్నారా.?

జీవితంలో ప్రతీ వ్యక్తికి ఒక ప్రేమ కథ ఉంటుంది. కొన్ని కథలు సుఖాంతమయితే మరికొన్ని మధ్యలోనే ముగిసిపోతుంటాయి. అయితే ఎవరి జీవితంలో అయినా తొలిప్రేమకు ఉండే ప్రాధాన్యతే వేరు. తొలియవ్వనపు రోజుల్లో ఒక వ్యక్తిపై కలిగే ఫీలింగ్‌ మాటల్లో వర్ణించలేనిది. అది ప్రేమో, ఆకర్షణో, ఆరాధనో తెలియని సమయంలో కలిగే భావన తాలుకూ జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. జీవితంలోని పేజీలను తిరగేస్తే అలాంటి మధురానుభూతులు తట్టిలేపుతాయి. తాజాగా అలాంటి ఓ ప్రేమ కథనే పంచుకుంది అందాల తార కియారా అద్వాణీ.

తన తొలి ప్రేమ అనుభవాల గురించి మాట్లాడుతూ.. ‘ఇంటర్‌ చదివే రోజుల్లో అబ్బాయిని ఎంతగానో ఇష్టపడ్డాను. సెలవు రోజుల్లో ఇంట్లో ఏదో ఒక అబద్ధం చెప్పి అతడిని కలుసుకునేదాన్ని. మరోవైపు చదువును అశ్రద్ధ చేస్తున్నానంటూ నా పేరెంట్స్‌ కొప్పడేవారు. ఈ సంఘర్షణ నడుమ నా ప్రేమను త్యాగం చేశాను. ఆ సమయంలో నేను మానసికంగా ఎంతో ఆవేదనకు గురయ్యాను. వయసుపరంగా వచ్చిన పరిపక్వతతో క్రమంలో కోలుకున్నాను’ అంటూ తన బ్రేకప్‌ లవ్‌ స్టోరీని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. మరి ఈ అందాల తార మనసు దోచుకున్న ఆ లక్కీ ఫెల్లో ఎవరో.. ఇప్పుడెక్కనున్నాడో.. బాలీవుడ్‌లో సక్సెస్‌ ఫుల్‌ హీరోయిన్‌గా దూసుకెళుతోన్న కియారా తెలుగులో భరత్‌ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here