గార్డెన్‌లో స‌మంత‌.. ఏం చేసిందో తెలిస్తే షాక్‌.

హీరోయిన్ స‌మంత షూటింగ్‌లు లేక‌పోవ‌డంతో చాలా ఫ్రీగా ఉన్న‌ట్లున్నారు. దీంతో స‌మ‌యంతా ఫ్యామిలీతోనే గ‌డిపేస్తున్నారు. ప్ర‌త్యేకంగా తెలుగింటి ఆడ‌ప‌డుచు అయిన సామ్ ఇంట్లో వంట ద‌గ్గ‌ర నుంచి అన్ని ప‌నులు ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నారు.

ఇప్ప‌టికే ఇంట్లో గార్డెన్‌ను స‌మంత ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. అయితే ఇటీవ‌లె ఆమె కూర‌గాయ‌లు పండిస్తున్నారు. క‌రోనా విజృంభిస్తున్న‌ప్ప‌టి నుంచి ఇంట్లో పండిన కూర‌గాయ‌ల‌తోనే వంట‌కాలు తయారు చేసుకుంటున్నారు. కాగా ఈ రోజు ట్విట్ట‌ర్‌లో ఓ పోస్టు పెట్టింది స‌మంత‌. ఇందులో క్యారెట్‌లు పండించిన‌ట్లు తెలిపింది.

వారం రోజుల పాటు క్యారెట్‌తోనే వంట‌కాలు చేస్తామ‌ని చెబుతోంది. క్యారెట్ల‌తోనే జ్యూస్‌లు, ప‌చ్చ‌ళ్లు, హ‌ల్వా, పకోడీ ఇలా అన్నీ క్యారెట్ వంట‌కాలే అని తెలిపింది. అంత‌కుముందు నాగార్జున బ‌ర్త్ డే సంద‌ర్బంగా ఓ  గిఫ్టును ఆమె రెడీ చేసింది. నాగ్ కామ‌న్ డిస్ ప్లే పిక్చ‌ర్‌ను ఆమె రిలీజ్ చేశారు. మామ బ‌ర్త్ డే సంద‌ర్బంగా సిడిపిని విడుద‌ల చేయ‌డం త‌న‌కు ద‌క్కిన గౌర‌వం అని స‌మంత ట్వీట్ చేశారు. మొత్తానికి ఈ రోజు ఉద‌యం నుంచి సమంత ట్విట్ట‌ర్‌లో బిజీగానే ఉన్నారు. మామ‌య్య సిడిపి ని అభిమానుల‌తో పంచుకోవ‌డంతో పాటు వంటింటి కూర‌గాయ‌ల వ‌ర‌కు ఆమె ఎన్నో విష‌యాలు అభిమానుల‌తో పంచుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here