జ‌క్క‌న్న‌తో మ‌హేష్.. ప్రాజెక్ట్ ఓకేనా..

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు రాజ‌మౌళితో సినిమా చేస్తున్నారంటే అభిమానుల‌కు పండ‌గే. వీరిద్ద‌రి కాంబినేష‌న్ క‌లిస్తే బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌డుతుంద‌ని అంద‌రూ ఫిక్స‌య్యారు. మ‌రి మ‌హేష్‌, జ‌క్క‌న్న క‌లుస్తారో లేదో చూడాలి.

రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో మ‌హేష్ సినిమా చేస్తార‌ని చాలా రోజుల నుంచి అంటున్నారు. అయితే అది జ‌ర‌గ‌కుండానే లాక్‌డౌన్ వ‌చ్చి ప‌డింది. ఒక‌వేళ షూటింగ్‌లు మొద‌ల‌వ్వ‌గానే వీరి మ‌ధ్య ఒప్పందం కుదురుతుందా అన్న చ‌ర్చ ఇప్పుడు ఎక్కువైంది. ప్ర‌స్తుతం మ‌హేష్ స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్త‌వ్వ‌గానే రాజ‌మౌళికి అవ‌కాశం ఇస్తారా అన్న డిస్క‌ష‌న్ మొద‌లైంది.

అయితే మ‌హేష్‌తో సినిమా చేసేందుకు మురుగ‌దాస్ ఎదురుచూస్తున్నారంట‌. స్పైడ‌ర్‌తో డ‌ల్ అయిన మురుగ మ‌రోసారి మ‌హేష్‌తో చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ సారి ఎలాగైన సూపర్‌హిట్ కొట్టాల‌ని ప్లాన్ చేస్తున్నారు. మ‌రి మురుగ‌దాస్‌కు  మ‌హేష్ కు మ‌ళ్లీ అవ‌కాశం ఇచ్చేందుకు కూడా సానుకూలంగానే ఉన్న‌ట్లు ప‌లు పుకార్లు వ‌స్తున్నాయి. కానీ మ‌హేష్ నెక్స్ట్ ప్రాజెక్టు గురించి క్లారిటీ లేదు.

అయితే షూటింగ్ ప్రారంభిస్తే మ‌రో ఆరు నెలల్లో మ‌హేష్ స‌ర్కారు వారి పాట పూర్త‌వుతుంది. రాజ‌మౌళి కూడా ఆర్ఆర్ఆర్ పూర్త చేసే ప‌నిలోనే ఉన్నారు. షూటింగ్ మొద‌లెడితే ఆరేడు నెల‌ల్లోపు దీన్ని పూర్తి చేయాల‌ని రాజ‌మౌళి అంతా రెడీ చేసుకుంటున్నారు. మ‌రి ఇద్ద‌రిదీ ఒకే టైంలో పూర్త‌యితే వీరిద్ద‌రూ క‌లిసి సినిమా చేసే చాన్స్ ఉంది. అయితే రాజ‌మౌళి తొంద‌ర‌ప‌డి సినిమా చెయ్యరు. రాజ‌మౌళితో సినిమా చెయ్యాలంటే ఎవ‌రైనా స‌రే కొన్ని రోజులు వెయిట్ చెయ్య‌క త‌ప్ప‌దు. మ‌రి ఈ ప‌రిస్థితుల్లో మ‌హేష్‌, జ‌క్క‌న్న క‌లుస్తారో లేదో ఆస‌క్తిక‌రంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here