క‌రోనాపై సీఎం జ‌గ‌న్ కీల‌క ఆదేశాలు

క‌రోనాపై ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రోగుల విష‌యంలో నిర్ల‌క్ష్యంగా ప్ర‌వ‌ర్తిస్తే ఎంత‌వ‌ర‌కైనా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు క్లియ‌ర్‌గా చెబుతున్నారు. స్పంద‌న కార్య‌క్ర‌మంపై జిల్లా క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌తో జ‌గ‌న్ స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

క‌రోనా బారిన ప‌డిన వ్య‌క్తికి అర‌గంట లోపు బెడ్ కేటాయించాల‌ని సీఎం జ‌గ‌న్ అన్నారు. క‌రోనా రోగుల‌కు ఇచ్చే ఆహారం, సౌక‌ర్యాలు బాగుండాల‌ని చెప్పారు. క‌రోనా హాస్పిట‌ల్స్‌లో హెల్ప్ డెస్కులు ఉండాల‌న్న సీఎం.. వాటికి వ‌చ్చే ఫిర్యాదుల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని సూచించారు. ఇక ప్రైవేటు ఆసుప‌త్రుల తీరుపై ఆయ‌న తీవ్ర స్థాయిలో హెచ్చ‌రికలు జారీ చేశారు.

ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన ఫీజుల కంటే ఒక్క రుపాయి కూడా ఎక్కువ తీసుకోకుండా చూడాల‌న్నారు. అలా తీసుకునే ప్రైవేటు ఆసుప‌త్రుల‌పై క‌చ్చితంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. క‌రోనా సోకిన వారితో మాన‌వ‌త్వంతో మెల‌గాల‌న్నారు. అలా కాకుండా క‌రోనాను ఆస‌రా చేసుకొని అధిక ఫీజులు వ‌సూలు చేసే వారికి బుద్ది వ‌చ్చేలా చేయాల‌న్నారు. ఇక అన్ని హాస్పిట‌ల్స్‌లో ఆక్సిజ‌న్, మందులు అందుబాటులో ఉండాల‌ని సీఎం ఆదేశించారు.

ఇక క్షేత్ర స్థాయి విష‌యానికొస్తే చాలా ప్రైవేటు ఆసుప‌త్రుల్లో అధిక ఫీజులు వ‌సూలు చేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు వ‌స్తూనే ఉన్నాయి. అయితే చేసేదేమీ లేక ల‌క్ష్ల‌ల్లో ఫీజులు క‌డుతూ రోగులు ఇబ్బందులు ప‌డుతూనే ఉన్నారు. సీఎం జ‌గ‌న్ ఇలా ఆదేశాలు ఇచ్చిన త‌ర్వాత అయినా ప్రైవేటు ఆసుప‌త్రుల్లో మార్పు వ‌స్తే బాగుంటుంద‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here