ప్ర‌భాస్ జోడి కోసం క‌స‌ర‌త్తులు..

ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గురించి తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఆదిపురుష్ సినిమాలో ఏ హీరోయిన్ తీసుకోవాలో టీం త‌ల‌మున‌క‌ల‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు బాహుబ‌లి తర్వాత ప్ర‌భాస్ కోసం స్టార్ ద‌ర్శ‌కులు క్యూ క‌డుతున్నారంట‌. ఈ నేప‌థ్యంలో ఆయ‌న సినిమాకు సంబంధించిన ఏ విష‌య‌మైనా ఇప్పుడు హాట్ టాపిక్ గానే మారుతోంది.

ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంతో రాబోతోన్న ఆదిపురుష్ సినిమాలో ప్ర‌భాస్ రాముడిగా క‌నిపిస్తార‌న్న అంచ‌నాలు ఇప్ప‌టికే వ‌చ్చేశాయి. ఇక హీరోయిన్ ఎవ‌ర‌న్న‌దానిపై ప్ర‌ధానంగా చ‌ర్చ న‌డుస్తోంది. అయితే ఒక్క హీరోయిన్ అయితే పెద్ద‌గా టెన్ష‌న్ ఉండేది కాదు. ఇక్క‌డ హీరోయిన్ సీత పాత్ర చేయాల్సి ఉంటుంది. అందుకే ఎవ‌రిని తీసుకోవాల‌న్న అన్న ఉత్కంఠ‌త నెల‌కొంది.

ప్ర‌ధానంగా కీర్తి సురేష్‌, కియరా అద్వానీ పేర్లు ప్ర‌ధానంగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్ప‌టివ‌ర‌కు కీర్తి సురేష్ నార్త్ లో డైరెక్ట్ గా ఏ సినిమాలు చేయ‌లేదు. కొన్ని డ‌బ్బింగ్ సినిమాల్లో న‌టించ‌డం త‌ప్ప కీర్తి నార్త్ ఆడియ‌న్స్‌కి బాగా తెలియ‌ద‌న్న వాద‌న ఉంది. ఇక మ‌న ఇండ‌స్ట్రీలో అయితే కీర్తి సురేష్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌రి ఇండియా లెవ‌ల్‌లో తీస్తున్న మూవీలో హీరోయిన్ నార్త్‌లో బిజినెస్ రాబ‌ట్టేలా ఉండాల‌న్న‌ది టాక్‌.

కియారా విష‌యానికొస్తే ఈ మూవీలో ఈమె పేరు ప‌రిశీల‌న‌లోనే ఉన్న‌ట్లు తెలుస్తోంది. చిత్ర బృందం కూడా ఇందుకు పాజిటివ్ రెస్సాన్స్‌తోనే ఉన్నారంట‌. సీత పాత్ర‌కు ఈ ముద్దుగుమ్మ బాగా సెట్ అవుతార‌ని ప్ర‌భాస్ కు మంచి జోడీగా సీత‌మ్మ పాత్ర‌లో క‌రెక్టుగా స‌రిపోతార‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. మ‌రి ఏ హీరోయిన్ వైపు మొగ్గుచూపుతార‌న్న విష‌యంలో డైరెక్ట‌ర్ అస్స‌లు క్లారిటీ ఇవ్వ‌లేదు. మ‌రిన్ని విష‌యాలు తెలియాలంటే చాలా టైం ప‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ప్ర‌భాస్ అభిమానులు మాత్రం థియేట‌ర్ల‌లో త‌మ హీరోను ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న టెన్షన్‌లో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here