న‌య‌న‌తార‌కు సెల్యూట్ చేస్తున్న స‌మంత‌..

ఇండ‌స్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ న‌య‌న‌తార పుట్టిన రోజు నేడు. దీంతో ఆమెకు ఎంతో మంది ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. అయితే ప్ర‌ముఖ హీరోయిన్‌, టాలీవుడ్ టాప్ స‌మంత కూడా విశెష్ చెప్పారు. కానీ స‌మంత చెప్పిన విశెష్ చాలా కొత్త‌గా ఉంది.

ఇంత‌కీ స‌మంత ఏమ‌న్నారంటే.. ఒకే ఒక నయనతారకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు. నువ్వు మరింతగా వెలగాలి. మనదైన దాని కోసం పోరాడే స్ఫూర్తిని మాలాంటి వాళ్లకి కలిగించాలి. నీకు మరింత బలం చేకూరాలి. సిస్టర్.. నీ బలానికి, పట్టుదలకు సెల్యూట్` అంటూ కామెంట్ చేసింది. ఇదిలా ఉంటే న‌య‌న‌తార‌, స‌మంత ఇద్ద‌రూ క‌లిసి ఓ త‌మిళ చిత్రంలో న‌టిస్తున్నారు. కాగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ దక్షిణాది లేడీ సూపర్‌స్టార్‌గా న‌య‌న‌తార గుర్తింపు తెచ్చుకున్న విష‌యం తెలిసిందే. ఇక స‌మంత సినిమాల‌తో పాటు ఇప్పుడు కొత్త‌గా ఓటీటీలో కూడా ఎంట‌ర్ అయ్యింది. ఇటు ఫ్యామిలీతో పాటు సినిమాలు, స్పెష‌ల్ షోల‌తో స‌మంత కూడా ఫుల్ బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here