స‌మంత హాట్ ఫోటో.. గంట‌లోపు ఎన్ని లైక్స్ వ‌చ్చాయో తెలుసా..

టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఇంకా టాప్ రేంజ్‌కు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇప్ప‌టికే సినిమా రంగంలో త‌న‌దైన ప్ర‌తిభ‌తో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ఓటీటీలో కూడా ఓ రేంజ్‌లో షోలు చేస్తోంది. ఆహాలో సామ్ జామ్ ప్రోగ్రాం ద్వారా అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది స‌మంత‌..

తాజాగా స‌మంత పెట్టిన ఓ హాట్ ఫోటో ఇప్పుడు అభిమానులను క‌ట్టిపాడేస్తుంది. స‌మంత ఫోటోను చూసిన వారంతా లైక్‌లు కొట్టేస్తున్నారు. హాట్ ఫొటోను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. సరికొత్త డిజైనర్ వేర్‌లో సమంత మరింతగా మెరుస్తోంది. 2021కి సిద్ధం అంటూ సమంత ఈ ఫొటోను పోస్ట్ చేసింది. ఈ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తక్కువ సమయంలోనే 1.5 లక్షల లైకులను దక్కించుకుంది. స‌మంత ఏదైనా సినిమా కోసం ఈ గెట‌ప్ వేసుకున్నారా అని అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు. కాగా ఇప్ప‌టికే టాప్ హీరోయిన్ల జాబితాలో ఉన్న ఈమె.. రానున్న సంవ‌త్స‌రంలో కూడా మ‌రిన్ని అవ‌కాశాలు ద‌క్కేందుకు అన్ని విధాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని అనుకుంటున్నారు. ఓ వైపు గ్లామ‌ర్ పాత్ర‌లు చేస్తూనే మ‌రో వైపు విభిన్న సినిమాలు చేసేందుకు స‌మంత రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here