భార‌త్ విష‌యంలో చైనా అందుకే ఇలా చేస్తోందా..

భార‌త్, చైనా మ‌ధ్య నెల‌కొన్న స‌రిహ‌ద్దు వివాదం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఆరు నెల‌ల‌కు పైగా ల‌ద్దాక్ ప్రాంతంలో ఇరు దేశాల‌కు యుద్ధ వాత‌వ‌ర‌ణం నెల‌కొన్ని విష‌యం తెలిసిందే. అయితే ఇప్ప‌టికే ప‌లు ద‌శ‌ల వారీగా ఇరు దేశాల‌కు మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయి. అయితే తాజాగా మ‌రో సారి చ‌ర్చ‌లు జ‌ర‌గాల్సి ఉన్నా జ‌ర‌గ‌డం లేదు. ఇందుకు చైనా కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

టిబెట్‌ నుంచి లద్దాఖ్ సరిహద్దుకు వరకూ ఉన్న చైనా భూభాగానికి బాధ్యత వహిస్తున్న వెస్ట్రన్ కమాండ్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు జనరల్ జావ్ నేతృత్వం వహించారు. 2017 నాటి డోక్లామ్ ప్రతిష్టంభనతో పాటూ ప్రస్తుత తూర్పు లద్దాఖ్‌ ఉద్రిక్తతలకు జావ్ వైఖరే కారణం. భారత్, టిబెట్ విషయంలో జావ్‌కు కొన్ని నిశ్చితాభిప్రాయాలు ఉన్నాయని, వాటి పర్యవసానంగానే డోక్లామ్, లద్దాఖ్ విషయంలో చైనా ఆర్మీ దూకుడు ప్రదర్శించిందనే అభిప్రాయం ఉంది.

తాజాగా ఈయ‌న స్థానంలో జెనరల్ జాంగ్ జెండాంగ్ ఇటీవలే నియమితులయ్యారు. ఈయ‌న‌కు ఈ ప్రాంతంలో నెల‌కొన్ని ప‌రిస్థితుల‌పై అంత‌గా అవ‌గాహ‌న లేద‌ని తెలుస్తోంది. ఈ ప్రాంతంతో అసలు ఏమాత్రం పరిచయం లేని జాంగ్‌కు చైనా ప్రభుత్వం వ్రెస్ట్రన్ కమాండ్ బాధ్యతలను అప్పగించడమనేది అనేక మందిని ఆశ్చర్యపరిచింది. వెస్ట్రెన్ కమాండ్‌ బాధ్యతలనను చైనా ప్రభుత్వం జనరల్ జాంగ్‌కు అప్పగించడం పలు ప్రశ్నలు లేవనెత్తింది. లద్దాఖ్ విషయంలో చైనా వైఖరిలో మార్పులు ఇదే సంకేతమా అనే అనుమానాలను రేకెత్తించింది. కానీ..ఈ మార్పుకు అవకాశం తక్కువని భారత్ వర్గాలు భావిస్తున్నాయి.

చైనా కమ్యునిస్టు పార్టీ ఆవిర్ఛించి 2021 నాటికి నూరు వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా అక్కడి ప్రభుత్వం కొన్ని వ్యూహాత్మక లక్ష్యాలు నిర్దేశించుకుందని, అందులో భాగంగానే లద్దాఖ్ విషయంలో చైనా ప్రభుత్వం సాగతీత ధోరణి అవలంబిస్తుందనేది భారత్ వర్గాల అభిప్రాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here