ఆ దేశంలో క‌రోనా తీవ్ర‌త‌రం.. ఏం చేశారంటే..

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ దేశాల‌ను భ‌య‌పెడుతూనే ఉంది. ఇప్పుడు దక్షిణ ఆఫ్రికాలో క‌రోనా వైర‌స్ విజృంభ‌న ఎక్కువ‌గా ఉంది. దీంతో అక్క‌డి ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు. ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మై అన్ని చ‌ర్య‌లు వేగంగా తీసుకుంటోంది.

కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో సతమతమవుతున్న దక్షిణాఫ్రికా.. తాజాగా వ్యాధి కట్టడి కోసం మరిన్ని పటిష్ట చర్యలు చేపట్టింది. అక్కడి ప్రభుత్వం మరోమారు మద్యం అమ్మకాలపై నిషేధం విధించింది. అంతేకాకుండా.. మాస్క్ ధరించకపోవడాన్ని క్రిమినల్ నేరంగా పరిగణిస్తామంటూ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. తాజా రూల్స్ ప్రకారం..మాస్క్ ధరించని వారికి ఏకంగా ఆరు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

రోనా కట్టడి ఏర్పాట్లను మొదటి స్థాయి నుంచి మూడోస్థాయికి పెంచాం. ఈ నిబంధనలు ఈ అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తాయి. అని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా సోమవారం నాడు ప్రకటించారు. మూడో లెవెల్‌లో ఉన్న కొన్ని నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. కరోనా కట్టడి కోసం ఇది తప్పనిసరి అని సిరిల్ స్పష్టం చేశారు.

కొత్త ఏడాది వేడుకలు, బంధుమిత్రులతో జరుపుకునే ఫంక్షన్ల కారణంగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనాపై పోరాటంలో మనం రక్షణాత్మక ధోరణికి పక్కన పెట్టి రిలాక్స్ అయ్యాం.. ప్రస్తుతం భారీ మూల్యం చెల్లించుకుంటున్నాం’ అని సిరిల్ ఆవేదన వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here