కాజల్‌కు సమంత ఇచ్చిన బహుమతి ఏంటో చూశారా.?

టాలీవుడ్‌ చందమామ బ్యాచిలర్‌ జీవితానికి గుడ్‌బై చెప్పుతూ ముంబయికి చెందిన ఒక ప్రముఖ వ్యాపారుడిని వివాహం చేసుకోనున్న విషయం తెలిసిందే. గౌతమ్‌ కిచ్లు అనే బిజినెస్‌ మ్యాన్‌ని అక్టోబర్‌ 30న ముంబయిలో అత్యంత సన్నిహితుల నడుమ పెళ్లి వేడుక జరగనున్నట్లు కాజల్‌ స్వయంగా తెలిపింది. ఇదిలా ఉంటే కాజల్‌ అగర్వాల్‌కు అభిమానులతో పాటు, ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా నటి సమంత.. కాజల్‌కు ఓ ఆకర్షణీయ బహుమతి ఇచ్చి ఆల్‌ ది బెస్ట్‌ తెలిపింది. సమంత ఇటీవలే ‘సాకి’ పేరుతో వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన బ్రాండ్‌కు సంబంధించిన దుస్తులతో కూడిన ఒక గిఫ్ట్‌ హాంపర్‌ను కాజల్‌కు పంపించింది. సమంత, కాజల్‌ ఇద్దరు కలిసి బృందావనం, బ్రహ్మోత్సవం వంటి చిత్రాల్లో కలిసి నటించిన విషయం తెలిసిందే.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here