మీ నిర్ల‌క్ష్యం వ‌ల్ల క‌రోనా పెరిగే అవ‌కాశం.. హెచ్చ‌రించిన సీఎం.

ప్ర‌జ‌ల నిర్ల‌క్ష్యం వ‌ల్ల క‌రోనా కేసులు పెరిగే అవ‌కాశం ఉంద‌ని మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ ఠాక్రే అన్నారు. కేసులు సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తగ్గుముఖం ప‌ట్టింద‌నుకున్న క‌రోనా కేసులు మ‌ళ్లీ న‌మోద‌వుతున్నాయి. దీంతో లాక్ డౌన్‌పై ఆయ‌న మాట్లాడారు.

మ‌హారాష్ట్రలో 15,28,226 కేసులు న‌మోద‌య్యాయి. ఇదివ‌ర‌కు రాష్ట్రంలో కేసులు త‌గ్గాయి. కానీ కేసులు మాత్రం మ‌ళ్లీ పెరుగుతున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో రెండో సారి క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగే అవ‌కాశం ఉంద‌న్న ఆందోళ‌న‌లు ఎక్కువ‌య్యాయి. దీంతో ప్ర‌జ‌లంతా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ప్ర‌భుత్వం సూచిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించాలా లేదా అన్న‌ది ప్ర‌జ‌లు తేల్చుకోవాల‌న్నారు. ప్ర‌జ‌లు మాస్కులు ధ‌రించ‌కుంటే ప‌రిస్థితులు ఎంత‌వ‌ర‌కు వెళ‌తాయో అన్న ఆందోళ‌న ఆయ‌న వ్య‌క్తం చేశారు.

మాస్క్ ధ‌రించి సామాజిక ధూరం పాటిస్తారా లేదంటే ఆంక్ష‌ల‌న‌క‌నీ మళ్లీ అమ‌లు చేయాలా అని అడిగారు. రానున్న పండుగ‌ల నేప‌థ్యంలో ఆల‌యాలు తెరిచేది లేద‌న్నారు. చాలా మంది ప్ర‌జ‌లు మాస్కులు లేకుండా తిర‌గ‌డం చూశాన‌ని సీఎం తెలిపారు. అయితే ప్ర‌జ‌లెవ్వ‌రూ నిర్ల‌క్ష్యంగా ఉండ‌కూడ‌ద‌న్నారు. ప్ర‌జ‌లంతా నిబంధ‌న‌లు పాటిస్తే మ‌రిన్ని వెసులుబాటులు క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. కాగా ఇప్ప‌టికే ప‌లు దేశాల్లో క‌రోనా రెండో సారి విజృంభ‌ణ కొన‌సాగుతోంది. దీంతో అక్క‌డ లాక్‌డౌన్ మళ్లీ విధిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here