అమాయక చూపులతో అందాల వల విసురుతోన్న ప్రియా.!

ఒక చిన్న కన్ను గీటి ఒక్క రోజులో యావత్‌ దేశ వ్యాప్తంగా సెన్సేషన్‌గా మారింది నటి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. తన క్యూట్‌ ఎక్స్‌ ప్రెషన్స్‌ తో కుర్రకారు మతి పోగొట్టిన ప్రియా.. అప్పట్లో ఇంటర్నెట్‌లో ఓ సెన్సేషన్‌. చేసినవి కొన్ని సినిమాలే అయినా ఎంతో పేరు సంపాదించుకున్న ఈ చిన్నది ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ జోష్‌ మీదుంది. ‘ఓరు ఆడు లవ్‌’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ చిన్నది ప్రస్తుతం తమిళం, తెలుగుతో పాటు హిందీలోనూ నటిస్తోంది.

ఇదిలా ఉంటే సినిమాలతో బిజీగా ఉంటోన్న ప్రియా ప్రకాశ్‌ వారియర్‌.. సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్‌ ఫొటోలను అభిమానులతో పంచుకోవడం ఈ బ్యూటీకి అలవాటు. అయితే తాజాగా ప్రియా హాట్‌నెస్‌ను కాస్త ఎక్కువగా పెంచేసింది. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన హాట్‌ హాట్‌ ఫొటోలను పోస్ట్‌ చేస్తూ కుర్రకారు మతిపోగొడుతోంది. అందాలను ఒలకపోస్తూ.. దిగిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్‌గా మారాయి. తన అమాయక చూపులతో అందాల వల విసురుతోందీ బ్యూటీ. మరి ఓసారి ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here