రకుల్, సారాలను క్షమాపణలు కోరిన సమంతా.. !

ప్రస్తుతం దేశంలోని అన్ని సినిమా ఇండస్ట్రీలలో డ్రగ్స్ వ్యవహారం సంచలంగా మారిన విషయం తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య విచారణలో భాగంగా డ్రగ్స్‌ కోణం ఉన్నట్లు బయటకు వచ్చింది.

నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ఇటీవల సుశాంత్‌ ప్రేయసి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌, శామ్యూల్‌ మెరిండాతోపాటు మరి కొంతమందిని అరెస్టు చేసి, విచారణ చేస్తోంది. ఈ క్రమంలోనే కస్టడీలో ఉన్న రియా 20 పేజీల స్టేట్ మెంట్ ను ఎన్‌సీబీకి అందించారని, అందులో డ్రగ్స్‌ తీసుకుంటున్న 25 మంది సెలబ్రిటీల పేర్లను వెల్లడించారని ప్రచారం జరిగింది.

ఈ పత్రాల్లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సారా అలీఖాన్‌ పేర్లు కూడా ఉన్నట్లు వార్తలు పుట్టుకొచ్చాయి. అనేక వెబ్‌సైట్లు కథనాలు రాయడంతో శనివారం రకుల్‌ప్రీత్‌పై నెటిజన్లు అనేక కామెంట్లు చేశారు.  అయితే రకుల్‌, సారా పేర్లు జాబితాలో లేవని తాజాగా ఎన్‌సీబీ పేర్కొంది.  దీంతో రకుల్‌, సారా తప్పు లేదని తెలుసుకున్న నెటిజన్లు ‘సారీ రకుల్‌’, ‘సారీ సారా’ అని పోస్ట్‌లు చేస్తున్నారు. నటి సమంత కూడా అందరి తరఫున క్షమాపణలు చెప్పారు. సమంత ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ‘సారీ రకుల్’, ‘సారీ సారా’ అనే హ్యాష్ ట్యాగ్ ను పోస్ట్ చేసింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here